12, అక్టోబర్ 2026, సోమవారం

గాయత్రీ శుభఫలదాత్రీ - విష్ణుప్రియ గారి గీతం



గాయత్రీ శుభఫలదాత్రీ
సావిత్రీ వేదవరదాత్రీ
వేదమంత్ర జననీ
సకల యంత్రతంత్ర సుజనీ
హంసవాహినీ యోగధారిణీ
బ్రహ్మ తేజో వివర్ధినీ

సూర్యమండల వాసినీ
సామవేద స్వరూపిణీ
అక్షరమాలా ధారిణీ
అంబా అమృతవర్షిణీ
సకలశాస్త్ర వరప్రదాయినీ
మహా మంత్రఫల ప్రసాదాయినీ

అజ్ఞాన తిమిర సంహారిణీ
తరణి స్నేహ గమనీ
ఆనందామృత దాయినీ
సదా నిత్యస్మరణీ
సకల వేద సంచారిణీ
మహా వైభవకారిణీ

భక్తులకు శుభఫలాలను ప్రసాదించే తల్లీ గాయత్రీదేవీ! సావిత్రీ స్వరూపిణిగా వేదజ్ఞానాన్ని వరంగా అనుగ్రహించే తల్లివి నీవు. వేదమంత్రాలన్నింటికీ జననివి, సమస్త యంత్రతంత్ర విద్యలకు మూలమైన పవిత్రశక్తివి. హంసను వాహనంగా కలిగి, యోగశక్తిని ధరించి, సాధకులలో బ్రహ్మతేజస్సును పెంపొందించే దివ్యమాతవు. సూర్యమండలంలో నివసిస్తూ, సామవేద స్వరూపంగా ప్రకాశించే తల్లివి. అక్షరమాలను ధరించి, అమృతధారలను కురిపిస్తూ, సమస్త శాస్త్రాలలో జ్ఞానాన్ని, వాటి అధ్యయనానికి తగిన వరాలను ప్రసాదిస్తావు. మహామంత్రాలను జపించే భక్తులకు ఆ మంత్రసాధన ఫలితాలను అనుగ్రహిస్తావు. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసరింపజేసే తల్లివి. సూర్యుని కాంతితో సన్నిహిత సంబంధం కలిగి, ఆ దివ్యప్రకాశంతో విహరించే దేవతవు. భక్తులకు పరమానందమనే అమృతాన్ని ప్రసాదిస్తూ, ఎల్లప్పుడూ స్మరించదగిన పవిత్రమూర్తిగా వెలుగొందుతావు. సమస్త వేదాలలో వ్యాపించి, వాటి అంతరార్థంగా నిలిచి, భక్తులకు గొప్ప వైభవాన్ని, శ్రేయస్సును కలిగించే గాయత్రీమాతవు నీవు.

విష్ణుప్రియ గారు రచించి రేవతి రాగంలో స్వరపరచిన ఈ గీతాన్ని సాధనాంజలి సంగీత బృందం ఆలపించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అహోబిలహరిని అర్చింతును - సాయికృష్ణ యాచేంద్ర గారి భక్తి గీతం

అహోబిలహరిని అర్చింతును నా అంతరంగమే అర్పింతును నరమృగప్రవృత్తులు ధరలో కలవని ఎరిగింప ఈ రూపు ధరియించిన భయావహం ఆ రూపం అయినా దయామయం హృదయం కన్నులలో...