మాధవునకు మంగళం సాధుప్రియునకు జయ మంగళం
సజ్జనులకు ప్రియుడైన మాధవునికి జయమంగళములు కలుగుగాక! మన్మథుని తండ్రికికి, మా మనస్సులను ఏలే శ్రీహరికి మంగళములు కలుగుగాక! మధు అనే రాక్షసుని సంహరించిన వానికి, భక్తులను తన చమత్కారమైన లీలలతో ఆనందింపజేసే స్వామికి మంగళములు కలుగుగాక! అపారమైన మహిమలు కలవానికి, మిక్కిలి గొప్పవాడైన పరమాత్మకు, భూదేవికి పతియైన శ్రీమహావిష్ణువుకు, సహజంగానే దివ్యతేజస్సుతో ప్రకాశించేవానికి మంగళములు కలుగుగాక! మాయకు లోబడని వానికి, మా ఇంటికి ప్రభువై మమ్మల్ని రక్షించే స్వామికి మంగళములు కలుగుగాక! ఇక్కడ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరునిగా వెలసి, తన నీడవలె ఎల్లప్పుడూ తనతోనే ఉండే లక్ష్మీదేవితో కూడి భక్తులను అనుగ్రహించే ఆ దివ్యదంపతులకు జయమంగళాలు కలుగుగాక!
ఈ తాళ్లపాక పెదతిరుమలాచార్యుల వారి కృతిని సురటి రాగంలో నేదునూరి కృష్ణమూర్తి గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి