నారాయణ నిన్న నామద స్మరణేయ
సారామృతవు ఎన్న నాలిగెగె బరలి
కష్టదల్లిరలి ఉత్కృష్టదల్లిరలి
ఎష్టాదరూ మతిగెట్టు ఇరలి
కృష్ణ కృష్ణ ఎందు శిష్టరు పేళువ
అష్టాక్షర మహా మంత్రద నామవ
సంతత హరి నిన్న సాసిర నామవ
అంతరంగద ఒళగిరిసి
ఎంతో పురందర విఠల రాయన
అంత్య కాలదల్లి చింతిసో హాంగె
ఓ నారాయణా! నీ నామస్మరణ అనే అమృతసారము ఎల్లప్పుడూ నా నాలుకపై నిలిచి ఉండుగాక. నేను కష్టాలలో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంతటి అయోమయానికి లోనైనా, సజ్జనులు భక్తితో పలికే కృష్ణా కృష్ణా అనే పవిత్రమైన మహామంత్ర నామము నా నోట నిరంతరం పలుకుతూ ఉండుగాక. ఓ హరీ! నీ వేలాది నామాలను ఎల్లప్పుడూ నా అంతరంగంలో నిలుపుకొని స్మరిస్తూ ఉండే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. జీవితమంతా నీ నామస్మరణలో గడిపి, చివరకు అంత్యకాలంలో కూడా నా మనస్సు మరెక్కడికీ పోకుండా పురందర విఠలుడవైన నిన్నే చింతిస్తూ ఈ జీవితాన్ని ముగించే అనుగ్రహాన్ని నాకు కలిగించు.
శుద్ధ ధన్యాసి రాగంలో స్వరపరచబడిన ఈ పురందరదాస కృతిని విదుషీమణి ఎంఎస్ షీలా గారు ఆలపించారు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి