▼

19, సెప్టెంబర్ 2026, శనివారం

గణేశకుమార పాహి మాం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


గణేశకుమార పాహి మాం గజముఖ

మనోరథ సిద్ధి దాయకా
ఆగమపదాదినుత భవ శ్రీ గురుగుహనుత గజముఖ 

గజముఖుడవు, బాలస్వరూపుడవైన గణేశా! నన్ను కాపాడుము. నా మనోరథాలను సిద్ధింపజేసే వాడవు నీవు. ఆగమశాస్త్రాలలోని పవిత్రమైన పదములచే మొదటినుండి స్తుతింపబడేవాడవు, భవుడైన పరమశివునిచే వందింపబడేవాడవు, శ్రీ గురుగుహుడైన కుమారస్వామిచే కూడా నుతింపబడేవాడవు. నన్ను కాపాడుము.

ఝంఝూటి రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని స్కందశ్రీ శివప్రసాద్ గారు ఆలపించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి