ఎన్నాళ్లు రంగులు పులుముకున్న హృదయంతో సంభాషిస్తావు?
అసలు అంతరంగాన్ని శుద్ధి చేసి ఎప్పుడు ఆవిష్కరిస్తావు? రంగు రంగుల మాయా ప్రలోభాలతో గారడీలెన్నాళ్లు చేస్తావు? నిష్క్రమణమున రంగులు వివర్ణమవుతాయని ఎందుకు మరుస్తావు? నీ నైజం నుంచి దూరంగా ఎన్నాళ్లు పారిపోతావు? నీవెవరో తెలుసుకునేందుకు ఎందుకు సందేహిస్తావు? దుర్లభమైన మానవునిగా జన్మించి అజ్ఞానముతో రాక్షసునిగా ప్రవర్తించి కర్మ ఫలమున నిస్సహాయునిగా అనుభవించి మరణించి నీవు సాధించేదేమిటి జన్మ జన్మలు పాపపుణ్యముల నడుమ కొట్టుమిట్టాడితే నీకు ఒరిగేదేమిటి లెక్కలకతీతమైతే ఎల్లలులేని ఆనందం లెక్కలలో మునిగితే పుట్టెడు దుఖమే మిగులు ఎప్పటికీ నిలిచేది నీ అంతరంగ సౌందర్యం యొక్క గుబాళింపులు ఎన్నటికీ వాడనిది నీ హృదయ కమలం యొక్క పరిమళాలు మానవత్వమొకటే నీ మతమవ్వాలి నలుగురి శ్రేయస్సే నీ కులమవ్వాలి |
30, మార్చి 2015, సోమవారం
మానవత్వమొకటే నీ మతమవ్వాలి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అహోబిలహరిని అర్చింతును - సాయికృష్ణ యాచేంద్ర గారి భక్తి గీతం
అహోబిలహరిని అర్చింతును నా అంతరంగమే అర్పింతును నరమృగప్రవృత్తులు ధరలో కలవని ఎరిగింప ఈ రూపు ధరియించిన భయావహం ఆ రూపం అయినా దయామయం హృదయం కన్నులలో...
-
నీ నామ రూపములకు నిత్య జయ మంగళం పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు ||నీ నామ|| పంకజాక్షి నెలకొన్న అంక యుగమునకు ||నీ నామ|| నళినారి ...
-
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదేతద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః స...
-
హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారుట. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ ...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి