ఉదయం యోగాలో సూర్యనమస్కారాలు చేసెటప్పుడు వచ్చిన కవితావేశంలో రాసిన సూర్య నమస్కారం:
సిత్రాల సిత్రాల సూరీడు పొద్దున్నె నిద్దుర లేపాడు
వేడి వేడి బాణాల సూరీడు రేతిరిని దాటి వచ్చాడు
దండాలు దండాలు సూరీడు నీ వెలుగుతో బతుకుల కాపాడు
ఏడు గుర్రాల సూరీడు మా భూదేవిని సల్లంగా నువు సూడు
ఎర్రని పండనుకొని సూరీడు నిను హనుమయ్య మింగగ వచ్చాడు
ఎండ మండించిన సూరీడు మేఘాలని వర్షంగా పంపాడు
నువ్వు రాకుంటే సూరీడు మాకు బువ్వ బతుకు లేదు సూరీడు
నువ్వు రాకుంటే సూరీడు చెట్టూ చేమా ఏడ్చేను సూరీడు
చంద్రునితో కలిసి సూరీడు ఈ పుడమిని ఏలూ సూరీడు
ప్రత్యక్ష దైవము సూరీడు నీ పాదాల మొక్కుతా సూరీడు
సిత్రాల సిత్రాల సూరీడు మా ఆరోగ్యదాత ఈ సూరీడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అహోబిలహరిని అర్చింతును - సాయికృష్ణ యాచేంద్ర గారి భక్తి గీతం
అహోబిలహరిని అర్చింతును నా అంతరంగమే అర్పింతును నరమృగప్రవృత్తులు ధరలో కలవని ఎరిగింప ఈ రూపు ధరియించిన భయావహం ఆ రూపం అయినా దయామయం హృదయం కన్నులలో...
-
నీ నామ రూపములకు నిత్య జయ మంగళం పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు ||నీ నామ|| పంకజాక్షి నెలకొన్న అంక యుగమునకు ||నీ నామ|| నళినారి ...
-
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదేతద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః స...
-
హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారుట. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ ...
మంచి రిధం వచ్చింది ప్రసాద్, పాటలు రాస్తూ ఉండండి.
రిప్లయితొలగించండి