2, అక్టోబర్ 2016, ఆదివారం

శరన్నవరాత్రులు - బాలాత్రిపురసుందరి అలంకారం


ఈరోజు బెజవాడ కనకదుర్గమ్మ బాలాత్రిపుర సుందరి అలంకారం కదా. ముత్తుస్వామి దీక్షితుల వారి బాలాంబిక కృతి ఒకటి విన్నాను. అద్భుతమైన సాహిత్యం. ఆదిపరాశక్తి తత్త్వమంతా ఈ కృతిలో నిబిడీకృతమై ఉంది. కేజే యేసుదాస్ గారి గాత్రంలో దీనిని వినవచ్చు.

భజరే రే చిత్త బాలాంబికాం భక్త కల్ప లతికాం

నిజరూప దాన దక్ష చరణాం
అరుణాం నిత్యాం కళ్యాణీం శర్వాణీం

శ్రీ వాగ్భవ కూట జాత చతుర్వేద స్వరూపిణీం
శృంగార కామ రజోద్భవ సకల విశ్వ వ్యాపినీం
దేవీం శక్తి బీజోద్భవ మాతృకార్ణ శరీరిణీం
దేవనుత భవ రోగ హర వైద్య పతి హృదయ విహారిణీం
భావ రాగ తాళ మోదినీం భక్తాభీష్ట ప్రదాయినీం
సేవక జన పాలినీం గురుగుహ రూప ముత్తు కుమార జననీం


1 కామెంట్‌:

  1. అక్కిరాజు ప్రసాద్ గారు, ఇవాళే మీ బ్లాగు చూడటం తటస్తించింది. చాలా సంతోషము.

    రిప్లయితొలగించండి